Friday, July 30, 2021

అనసూయ వ్యాక్సిన్ పాట్లు

Must Read

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనసూయ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ మీద హాట్ టాపిక్ అవుతుంటారు. సోషల్ మీడియాలో అనసూయ చేసే పనులు, షేర్ చేసే ఫోటోలు అందరినీ ఆకర్షిస్తుంటాయి. ఇక నెగెటివ్ కామెంట్లను భరించలేక అనసూయ అందరినీ బ్లాక్ చేసేస్తుంటారు. అయినా కూడా అనసూయ మాత్రం సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు.

తాజాగా అనసూయ తన భర్తతో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఒకానొకప్పుడు 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చేవారు. ఆ సమయంలో వ్యాక్సిన్ గురించి అనసూయ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. అయితే అనసూయకు ఇంజక్షన్‌లంటే భయమని ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకుని, కళ్లు మూసుకుని తెగ భయపడిపోయారు. మొత్తానికి వ్యాక్సిన్ వేసుకున్నామని అనసూయ చెప్పారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This