Saturday, June 19, 2021

ఇక సెలవు: యాంకర్ సుమ గుడ్ బై..! షాక్ లో ఫ్యాన్స్

Must Read

టెలివిజన్ బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, వాళ్లలో ఎవరూ నెంబర్ 1 స్థానాన్ని పొందలేకపోతున్నారు. దీనికి కారణం యాంకర్ సుమ సుమ.. దాదాపు పదేళ్లుగా ఈమెనే టాప్ ప్లేస్‌లో వెలుగొందుతోంది. యాంకర్ సుమ ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. ఏ చానెల్ అయినా ఏ షో అయినా సుమ హ్యాండిల్ చేస్తే కచ్చితంగా హిట్ అవుతుంది. అలాంటి సుమ చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి.

అయితే అలా సుమ, రవి కలిసి హోస్ట్ చేసే బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షో గురించి అందరికీ తెలిసిందే. సుమ, రవి ఇద్దరూ కలిసి ఈ షోను బాగానే నడిపిస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ కార్యక్రమంలో సెలెబ్రిటీలు గెస్టులుగా వస్తుంటారు. ప్రతి వారం ఏదో ఒక సినిమాకు సంబంధించిన వాళ్లో.. ఓ షోలో చేసే వాళ్లోనో తీసుకొచ్చి వాళ్లతో సవాళ్లు చేయిస్తుంటారు.

ఈ ఆదివారం ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ అన్నట్టుగా గల్లీబాయ్స్ సద్దాం ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడే అందరికీ కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. సుమ లేకుండా వచ్చిన మొదటి ప్రోమో ఇదే. సుమ ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు లేదు? ఏమైంది అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సుమ మళ్లీ ఎంట్రీ ఇస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This