Saturday, June 19, 2021

ఆశు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. అక్కడ ముద్దు పెట్టి..!

Must Read

బిగ్ బాస్‌ సీజన్ 3‌ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఇండస్ట్రీలో సింగర్ గా మరోవైపు వరుసఅవకాశాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాహుల్ హీరోగా “చిచా” సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల బట్టల వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి బిజీగా ఉంటున్నాడు. రాహుల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయినా పునర్నవి, అషురెడ్డిలతో ప్రేమాయణం నడిపి పాపులర్ అయ్యాడు.

ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్ జూనియర్‌ సమంతగా గుర్తింపు పొందిన అషురెడ్డితో ప్రేమలో ఉన్నాడేమో అనిపించేలా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు,అలాగే అషురెడ్డిని రాహుల్ ఎత్తుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న సందేహం అందరిలోనూ నెలకొంది. ఈ విషయాన్ని ‘సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ పెట్టి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అతడు ప్రేమిస్తున్నది ఎవరినో కాదు బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ అషూ రెడ్డినే.

ఈ సర్‌ప్రైజ్‌ కచ్చితంగా రాహుల్, అషురెడ్డిల ప్రేమ విషయమే అయి ఉంటుందని చాలామంది ఊహిస్తున్నారు. అషురెడ్డి, రాహుల్‌ మధ్య బిగ్‌బాస్‌ షోలోనే ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోనున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అందుకే సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటూ రాహుల్‌ పోస్టు చేశాడని అభిప్రాయపడుతున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This