Saturday, June 19, 2021

దారుణంగా కౌశల్ భార్య పరిస్థితి.. కన్నీరుమున్నీరు అవుతున్న కుటుంబం

Must Read

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ భార్య నీలిమ ఆరోగ్యానికి సంబంధించి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ‘ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్‌ యూ, మిస్‌ యూ నీలిమ’ అంటూ సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెట్టాడు. గతంలో కౌశల్ తన భార్యని ఉద్దేశించి ఆమెకు క్యాన్సర్ అని.. ఇదివరకే సర్జరీ అయ్యిందని చెప్పడంతో అసలు నీలిమకి ఏమైంది? కౌశల్ ఎందుకు ఈ పోస్ట్ పెట్టాడని అభిమానులు ఆందోళన చెందారు.

ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేసింది.హాయ్.. అందరూ ఎలా ఉన్నారు. మీకందరికీ తెలియనిది ఏంటంటే.. నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలాక శ్వాస సమస్యలు ఎదురయ్యాయి. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్తే వారు కేవలం పారాసిటమాల్‌ టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చారు. పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.. ఆయాసం తగ్గింది.. నెగిటివ్ రాగానే ఇంటికి వచ్చేయాలి అనిపిస్తుంది. నా పిల్లల్ని చూడాలనిపిస్తుంది.. అందుకే ఇండియా వస్తా. యూకేలో కోవిడ్ వస్తే పరిస్థితి ఏంటి అన్నది మీతో పంచుకోవాలనిపించింది. అందరూ ధైర్యంగా ఉండండి.. అని తన ఆరోగ్య పరిస్థితిపై ‌సమాచారం ఇచ్చింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This