Friday, July 30, 2021

బాలీవుడ్ దిగ్గజం దిలీప్‌ మృతిపట్ల ప్రముఖులు సంతాపం

Must Read

తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్‌ కుమార్‌ చిత్రపరిశ్రమలో రాణించగా.. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కించుకున్నాడు. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో ఆయనను సన్మానించింది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రధాని మోడీతోపాటు పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు. ‘ఆయన మరణం సినీ లోకానికి, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు అంటూ ప్రధాని ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంతోమంది ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This