Saturday, June 19, 2021

నాగ‌బాబు మృతి చాలా బాధాక‌రం : చిరంజీవి

Must Read

స్వ‌యం కృషితో ఉన్న‌త స్థాయికి ఎదిగి కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న చిరంజీవిని చూసి చాలా మంది ఆద‌ర్శంగా తీసుకుంటారు. ఆ కోవ‌లో య‌ర్రా నాగ‌బాబు అనే అభిమాని కూడా ఉన్నారు. చిరంజీవి పిలుపు మేర‌కు నాగబాబు.. కోనసీమలో ఐ బ్యాంక్‌ ఏర్పాటు చేసి చూపు లేని ఎంతో మందికి కంటి చూపు ప్ర‌సాదించారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు చాలా మంది ప్ర‌జ‌లు నాగబాబుపై ఎనలేని అభిమానం చూపించారు.

అయితే కొద్ది రోజుల క్రితం క‌రోనాతో కాకినాడ ఆసుప‌త్రిలో చేరిన నాగబాబు ఆకస్మికంగా మృతి చెందారు. యర్రా నాగ‌బాబు మృతి విష‌యం తెలుసుకున్న వెంటనే చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. కొద్ది రోజుల క్రితం అతనితో మాట్లాడిన‌ప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. కాని ఇలా క‌రోనాతో మ‌ర‌ణించ‌డం బాధ‌గా ఉంది.

అతడి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సారీ నాగబాబు, మిస్‌ యూస అంటూ చిరంజీవి ఎమోషనల్ లో సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి సంతాపం తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This