Saturday, June 19, 2021

సినీపరిశ్రమలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత

Must Read

సినీపరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే కరోనా మహమ్మారి కొందరు నటులను, డైరెక్టర్ లను బలితీసుకుంది. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు ‌ రంగరాజన్‌ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 8.45 గంటలకు తుది శ్వాస విడిచాడు.

నేడు సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా రంగరాజన్‌ ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ హీరోగా ‘మీందమ్‌ కోకిల’, ‘మహారసన్‌’ వంటి పలు చిత్రాలు తెరకెక్కించాడు.

‘కల్యాణరామన్‌, ఎల్లం ఇంబమాయం, కాదల్‌ మీంగల్‌, ముత్తు ఎంగల్‌ సొత్తు, పల్లవి మీందుమ్‌ పల్లవి మీందమ్‌ పల్లవి, అడుత్తతు ఆల్బర్ట్‌’ వంటి చిత్రాలకు రంగరాజన్‌ దర్శకుడిగా వ్యవహరించాడు. ఆయన కొడుకు జీయన్నార్‌ కుమారవేలన్‌ కూడా దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. ఇతడు ‘నినైతలే ఇనిక్కుమ్‌’, ‘యువన్‌ యువతి’, ‘హరిదాస్‌’, ‘వాగా’ వంటి చిత్రాలకు డైరెక్షన్‌ చేశాడు. ప్రస్తుతం కుమారవేలన్‌ నటుడు అరుణ్‌ విజయ్‌తో కలిసి ‘సినం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This