Tuesday, July 27, 2021

బాలీవుడ్ హీరో ‘స్టేజ్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్’ మూవీతో డిజిటల్ అరంగేట్రం

Must Read

బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఓటిటిలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2002లో గుజరాత్ లోని గాంధీనగర్ లోని ‘అక్షర్ధామ్’ ఆలయంపై జరిగిన దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) ఉగ్రవాదులను వేటాడి, అదుపులోకి తెచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన ఆధారంగా “స్టేట్ అఫ్ సీజ్ : టెంపుల్ అటాక్” తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో అక్షయ్ ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారి పాత్రను పోషితున్నారు. ఈ మిషన్ కు ఆయనే నాయకత్వం వహిస్తారు. కెన్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ రోడ్, దివ్యాంక్ త్రిపాహి భర్త వివేక్ దహియా కూడా నటించారు. కాంటిలో పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ‘స్టేజ్ ఆఫ్ సీజ్’ సిరీస్‌లో రెండవ భాగం. మొదటి భాగంలో 26/11 ముంబై ఉగ్రవాద దాడులను చూపించారు. నిర్మాత అభిమన్యు సింగ్ అక్షయ్‌ నటనపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు అక్షయ్ ఖన్నా ‘లెగసీ’ పేరుతో రాబోతున్న వెబ్ సిరీస్‌లో కూడా కనిపించనున్నాడు. ఇందులో అతను మొదటిసారి రవీనా టాండన్‌తో కలిసి నటించనున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This