Wednesday, June 23, 2021

నిధి అందాలకు ఫ్లాట్ అయిన టాలీవుడ్ డైరెక్టర్

Must Read

నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనకంటూ గుర్తింపును సంపాదించుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్రిష్ కాంబోలో వస్తున్న సూపర్ ప్రాజెక్ట్ హరహర విరమల్లులో ప్రధాన పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ఇస్మార్ట్ బ్యూటీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాడట. నిధి అగర్వాల్ అందం ఒక్కటి మాత్రమే కాదు. పవర్ స్టార్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది నిధి. ఆ పీరియాడికల్ మూవీకి డైరెక్టర్ క్రిష్ అన్న సంగతి తెలిసిందే కదా! చారిత్రక చిత్రంలో నిధి చక్కగా నటిస్తోందట. అందుకే, టాలెంటెడ్ బ్యూటీని క్రిష్ ఎంకరేజ్ చేస్తున్నాడని సమాచారం

బాలీవుడ్ టూ తమిళం దాదాపు అన్ని భాషల్లో నిధి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కోలీవుడ్ లో కూడా ఈ బబ్లీ బ్యూటీ బాగానే క్రేజ్ పెంచుకుంటోంది. తెలుగులో మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత, కెరీర్ కి ఆశించినంత ఊపు రాకపోయినప్పటికీ ఇప్పుడు పీకే మూవీలో పర్పామెన్స్ కి ఛాన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తుండటంతో నిధి గురించిన చర్చ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతుంది.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This