Friday, July 30, 2021

రాజమౌళి “RRR” కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Must Read

సంచలన డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘RRR’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. DVV దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో 2021 అక్టోబర్ 13 న సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ ఆలస్యం కానుందని అంటున్నారు. 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారే కాబట్టి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇది సరైన తేదీ అని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న RRR బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This