Thursday, June 24, 2021

బిగ్ బాస్ అరియానాతో రచ్చ చేసిన RGV

Must Read

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏ చిన్న పని చేసినా కూడా అది సోషల్ మీడియా లో ట్రేండింగ్ గా మారుతుంటుంది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరి కలిసి వర్మ షేర్ చేసిన ఫోటో ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆ పిక్ లో వర్మ, బిగ్ బాస్ బ్యూటీ ఇద్దరూ కలిసి జిమ్ వర్కౌట్లు చేస్తున్నట్టు కన్పిస్తున్నారు.

ఈ బిగ్ బాస్ లిటిల్ గర్ల్ అరియనా నన్ను జిమ్ లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరం కలిసి వర్కౌట్లు చేశాము… కమింగ్ సూన్” అంటూ అరియనాతో జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ పోస్ట్ చేశాడు వర్మ. ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంకేముంది నెటిజన్లు ఈ పిక్ పై రకరకాల కామెంట్స్ కురిపిస్తున్నారు. కాగా యాంకర్ గా అరియనా కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది మాత్రం గోపాల్ వర్మ అని అందరికి తెలిసిన విషయమే.

దానికి కారణం గతంలో వర్మను అరియనా ఇంటర్వ్యూ చేయగా… ఆ సమయంలో అరియనాపై ఆయన చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. దీంతో అరియనాకు భారీగా క్రేజ్ రావడం… బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం జరిగింది. అరియనా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా వర్మ తనకు సపోర్ట్ తెలియజేసాడు. బిగ్ బాస్ లో చివరిదాకా కొనసాగి తనదైన ఆట తీరుతో అభిమానులను సొంతం చేసుకుంది ఈ అల్లరి పిల్ల అరియానా గ్లోరి.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This