Saturday, June 19, 2021

ఆనంద్ హీరో రాజా గుర్తున్నాడా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో తెలుసా?

Must Read

బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా నిలబడటం చాలా కష్టం. ఎవరో ఒక్కరో ఇద్దరో సక్సెస్ అవుతుంటారు.. వాళ్లు కూడా ఎవరూ టచ్ చేయలేనంత విజయాలు అందుకుంటే కానీ నిలబడలేరు. అలాంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కొందరు మంచి విజయాలు అందుకున్న తర్వాత కూడా కనబడలేదు. అలాంటి వాళ్లలో రాజా కూడా ఒకడు.

రాజా అంటే చాలా మందికి గుర్తుందో ఉందో లేదో కానీ ఆనంద్ సినిమాలో హీరో అంటే ఇట్టే గుర్తు పడతారు. మంచి కాఫీ లాంటి సినిమాతో వచ్చిన ఆయన అంతే విధంగా అందరినీ అలరించారు. మంచి హీరో అనిపించుకున్న స్మార్ట్ లుక్స్ ఉన్నటువంటి హీరో, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం 2004లో విడుదల అయ్యింది. అదే రోజు చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ విడుదలైతే కూడా తట్టుకొని మరి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాకు మంచి నేమ్ వచ్చింది, వెంటనే వెన్నెల, మాయాబజార్, మొగుడు పెళ్లాం ఓ దొంగోడు, ఇంకోసారి, ఓ చిన్నదానా లాంటి సినిమాలు కూడా చేసే మంచి హిట్ ను అందుకున్నాడు, వీటిలో కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు కూడా ఉన్నాయి. అయినా కూడా రాజా హీరోగా నిలదొక్కు లేకపోయాడు, దానికి కారణం తనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడమే. సినిమా పరిశ్రమలో ఇక్కడ ఏదైనా జరిగితే వెనక నిలబడడానికి అండ ఉండాలని లేకపోతే నిలబడడం కష్టం అంటున్నారు రాజా తాను అంత హటాత్హుగా సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం కూడా అదే అని చెబుతున్నాడు

విశాఖపట్నంలో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగిన రాజా.. చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయాడు. ఈ క్ర‌మంలోనే కింది స్థాయి నుండి కష్టపడి వ‌చ్చి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అయితే న‌టుడు కావాల‌నే ఆశ‌తో రూ.60 వేల ఉద్యోగాన్ని వ‌దులుకుని.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. త‌న ఆశ‌ను నెర‌వేర్చుకునేందుకు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు.

తాజాగా ఆలీతో సరదాగా షో కి వచ్చాడు రాజా, అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు లేదనకుండా సమాధానమిచ్చాడు. ఒకానొక సమయంలో నువ్వు చనిపోయారని వార్తలు వచ్చాయి, ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం చేశారు, ఏంటి ఆ స్టోరీ అని అడిగాడు ఆలీ, దానికి రాజా కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చాడు. వాడి కి సినిమాలు లేవు అవకాశాలు ఇవ్వడం లేదు దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ రాసారని, ఆవేదన చెందాడు రాజా. బతికున్న మనిషిని చంపడం కరెక్ట్ కాదు అని చెప్పాడు,

అయినా కూడా రాజా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఏమైందో ఏమో కానీ, రాజా అవ‌కాశాలు క్ర‌మంగా త‌గ్గిపోయాయి. ఇక అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో.. రాజా క్రైస్తవ యువతిని పెళ్లి చేసుకుని జీసస్‌ను దేవుడిగా అంగీకరించి సినిమాలను నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈయన పాస్టర్‌గా చాలా బిజీ అయిపోయాడు. దేశ వ్యాప్తంగా దేవుని వాక్యాన్ని భోధిస్తూ.. అంతర్జాతీయ సువార్తీకుడిగా మారారు రాజా. ఈయ‌న ప్ర‌సంగాలు యూట్యూబ్‌లో కూడా వైర‌ల్ అయ్యాయి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This