Home Movies దయచేసి ఎవ్వరూ రావద్దు.. బాలకృష్ణ సంచలన నిర్ణయం

దయచేసి ఎవ్వరూ రావద్దు.. బాలకృష్ణ సంచలన నిర్ణయం

0

అయితే ప్రస్తుతం క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండటంతో త‌న పుట్టిన రోజున‌ ఎవరూ రావొద్దంటూ బాలయ్య బాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ నెల 10వ తేదిన 61వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. బాలయ్య బాబు జన్మదినాన అభిమానులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు.

నా అభిమానులకు విజ్ఞ‌ప్తి అంటూ జూన్ 10న నా పుట్టినరోజు సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్సరం నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ, కరోనా విలయతాండవం చేస్తోన్న‌ ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అంత మంచిది కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానమే. దానికి ఎప్పుడూ మీకు బానిసనై ఉంటా.

ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేనని, మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదని, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదని, మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి ఎవ‌రూ రావ‌ద్ద‌ని తెలియ‌జేస్తున్నానని లేఖ విడుదల చేసాడు.

Exit mobile version