Saturday, June 19, 2021

నిఖిల్ కు షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు.. భారీ ఫైన్

Must Read

టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని రెండు చలాన్లను విధించారు. అయితే నిబంధనల ఉల్లంఘన సమయంలో నిఖిల్‌ కారులో లేడని పోలీసులు తెలిపారు.

కాగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే నిఖిల్ ప్రస్తుతం 18 పేజీస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే మరియు స్టోరీని అందిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ 2 సినిమా షూటింగ్ ను ఇప్పటికే ప్రారంభించగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది.

ఈ సినిమా కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుస్తోంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ సూపర్ హిట్ కావడం తో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This