Saturday, June 19, 2021

బ్రేకింగ్: హీరో రాజ్ తరుణ్ పెళ్లి ఫిక్స్..! అమ్మాయి ఎవరంటే?

Must Read

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరో అవుతారని ప్రేక్షకులు భావించారు. అయితే కథ, దర్శకుల ఎంపికలో లోపాల వల్ల కుమారి 21ఎఫ్ తరువాత రాజ్ తరుణ్ కు ఆ స్థాయి సక్సెస్ దక్కడం లేదు.

ఇక ఇప్పుడు యువ హీరో రాజ్ త‌రుణ్ త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కు శుభం కార్డు వేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. రాజ్ త‌రుణ్‌కి ఆ మ‌ధ్య ఓ నిర్మాత రెమ్యున‌రేష‌న్‌కు బ‌దులు కొత్త బంగ్లా కొనిచ్చాడ‌ట‌. ఇటీవ‌ల ఫ్యామిలీతో క‌లిసి కొత్త ఇంటికి కూడా షిఫ్ట్ అయిన‌ట్టు స‌మాచారం. కొత్త ఇల్లు ఎలాగు వ‌చ్చింది కాబ‌ట్టి త్వ‌ర‌లో పెళ్లికి కూడా యువ హీరో సిద్ద‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవల ఈ హీరో తన ఇంట్లో వాళ్లని కూడా ఒప్పించినట్లు టాక్ వస్తోంది.

ముందు నిశ్చితార్థం చేసుకొని అనంతరం ఈ ఏడాది చివరలో లేదా 2022 స్టార్టింగ్ లో గాని పెళ్లికి ముహూర్తం సెట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమ్మాయి త‌న స్నేహితురాలు అని తెలుస్తుంది . ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయినే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This