Saturday, June 19, 2021

హీరో సూర్య సంచలన నిర్ణయం: ఫ్యాన్స్ ఒక్కొక్కరికి రూ.5000/-

Must Read

కరోనా మహమ్మారి ప్రపంచంలోని జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా కరోనాతో బాధపడుతున్న వారే. ప్రముఖ నటుడు సోనూ సూద్​ .. పేద ప్రజలకు తనకు తోచినంత సాయం చేసి .. రియల్ హీరోగా నిలిచాడు. కోలీవుడ్ లో తమిళ హీరో సూర్య కూడా తన ఫ్యాన్స్​కు ఆర్ధికంగా సహాయం చెయ్యడానికి ముందు వచ్చాడు. తన అభిమాన సంఘంలో ఉన్న 250 మంది కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సూర్యకి తెలిసింది.

దీంతో వారికి ఒక్కోక్కరికి రూ. 5000 చొప్పున మొత్తం రూ.12.5 లక్షలను ఆర్థిక సాయంగా ఇచ్చారు. ఈ డబ్బును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోకి పంపించారు. ఇప్పుడే కాదు మొదటి నుంచి సూర్య ఆయన తమ్ముడు కార్తీ ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు. అగరం అనే ఫౌండేషన్ ను స్థాపించి అనాథలకు, నిరాశ్రయులకు చదువును అందిస్తున్నారు.

ఆ ఫౌండేషన్ పేరిట తమ తండ్రి శివ కుమార్ తో కలిసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి సూర్య బ్రదర్స్ ముందుకు వచ్చారు. కొద్దిరోజుల క్రితమే సీఎం స్టాలిన్ ను కలిసి కరోనా కుటుంబాలకు అండగా ఉండటానికి కోటి రూపాయలు తన వంతు విరాళంగా ఇచ్చారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This