Saturday, June 19, 2021

పోలీస్ స్టేషన్ లో హీరో విశాల్.. ఏం జరిగిందంటే?

Must Read

తమిళ స్టార్ హీరో విశాల్‏కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. హీరో విశాల్ సినిమాలు చాలానే తెలుగులో సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సౌత్ హీరో మరో వివాదంలో వార్తల్లో నిలిచాడు. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి పై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయం ఎప్పుడూ కోలీవుడ్ లో కలకలం రేపుతోంది. 2018 అభిమన్యుడు చిత్ర నిర్మాణం సందర్భంగా విశాల్ తనకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను పెట్టి ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అయిన ఆర్.బి.చౌదరి నుంచి కొంతమేర డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు మొత్తం తిరిగి చెల్లించిన తర్వాత డాక్యుమెంట్స్ అడుగగా.. నిర్మాత మాట మార్చేసాడని విశాల్ ఆరోపించాడు.

ఈ విషయం గురించి విశాల్ పలుసార్లు ఆర్.బి.చౌదరి వద్ద ప్రస్తావనకు తెచ్చారు.అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఈ మేరకు విశాల్ ఆ నిర్మాతపై కేసు నమోదు చేసినట్లుగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. మిస్టర్ ఆర్బిచౌదరి గారు.. సినిమాకోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించి కొన్ని నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు సినిమాకు ముందు రాసుకున్న చెక్ లీవ్స్, బాండ్స్, ప్రామిసరీ నోట్స్ తిరిగి ఇవ్వకపోవడం, అడిగితే ఎక్కడ పెట్టానో కనిపించడం లేదని సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడని… అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్వీట్ లో తెలిపాడు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This