Tuesday, July 27, 2021

హీరో విశాల్ మూవీ టైటిల్ వివాదం

Must Read

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం కొత్త సినిమా ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ పేరుతో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ టైటిల్ కారణంగా అతను వివాదంలో చిక్కుకున్నాడు. ఆ టైటిల్ తన నుండి విశాల్ కొట్టేశాడంటూ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు… స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్ళాడు విజయ్ ఆనంద్. శరవణన్ అనే కొత్త దర్శకుడితో విశాల్ ఈ సినిమా తీస్తున్నాడు.

దర్శకత్వ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న విజయ్ ఆనంద్… ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే టైటిల్ తో విశాల్ ‘చక్ర’ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సందర్భంలో కథ చెప్పాడట. ఇప్పుడు తన సినిమా టైటిల్ ను ఇల్లీగల్ గా విశాల్ తన మూవీకి పెట్టేసుకున్నాడని ఆరోపిస్తున్నాడు. ఈ విషయం తన దృష్టికి రాగానే ఇది సబబు కాదని విశాల్ తో చెప్పానని అన్నారు. అప్పుడు మౌనంగా ఉన్న విశాల్ ఆ తర్వాత అదే టైటిల్ ను తన సినిమాకు పెట్టేశాడని విజయ్ అన్నారు. ఇప్పుడు విశాల్ ను ఈ విషయమై ప్రశ్నిస్తే అతని మనుషులు తనను బెదిరిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఉదయినిధి స్టాలిన్ కు విజయ్ ఆనంద్ ఫిర్యాదు చేశాడట.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This