Tuesday, July 27, 2021

హోంబలే ఫిలింస్‌: హీరో పునీత్‌ కొత్త సినిమాకి టైటిల్‌ ఫిక్స్

Must Read

‘కె.జి.యఫ్’ లాంటి ఒక్క సినిమాతో హోంబలే ఫిలింస్‌ బ్యానర్ అగ్రస్థాయి బ్యానర్ గా నిలిచింది. ఈ సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా బడా సినిమాలే కావటం విశేషం. ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తోంది. ఈ సారి కొత్త సినిమాతో హోంబలే ఫిలింస్‌ ముందుకొస్తుంది.

కన్నడ స్టార్‌ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ హీరోగా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. లూసియా, యూ టర్న్‌ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ తెలిసినట్టు తెలుస్తోంది. ‘ద్విత్వ’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ కథలోని హీరో.. రెండు రకాలుగా ప్రవర్తిస్తాడట.. అందుకే ఈ చిత్రానికి ‘ద్విత్వ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This