Tuesday, July 27, 2021

సినీ ఇండస్ట్రీ లో సీనియర్ నటుడికి అనారోగ్యం

Must Read

ప్రముఖ సీనియర్ నటుడు అనారోగ్యం పాలవ్వటం ఆందోళనకరం. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆసుపత్రి పాలయ్యారు. జూన్ 29న న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనకు హాస్పిటల్ లో చేర్పించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ వయసు రీత్యా కలిగిన అనారోగ్య కారణాలతో మరోసారి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

ఈ విషయం గురించి ఆయన మేనేజర్ మాట్లాడుతూ “నసీరుద్దీన్ షా ఆరోగ్యం బాగానే ఉంది. ఆయనకు ఊపిరితిత్తులలో చిన్న ప్యాచ్ ఉంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపు ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్పారు.

ఇంతకుముందు ఒకసారి నషీరుద్దీన్ షా అనారోగ్యం పాలయ్యారని వార్తలు షికార్లు చేయగా… ఆయన కుమారుడు తన తండ్రి బాగున్నారని వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ నటుడు చివరిసారిగా వివేక్ అగ్నిహోత్రి నటించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘రాంప్రసాద్ కి తెహర్వి’, జీ5 ‘మీ రక్సం’ చిత్రాలలో నటించారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This