Friday, July 30, 2021

జానీ మాస్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో హీరో విజయ్…పిక్స్ వైరల్

Must Read

దక్షిణాదికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దాదాపు దక్షిణాదిలోని అగ్ర హీరోలందరితో తనదైన శైలిలో స్టెప్పులు వేయించాడు. ఇప్పుడు అతను కూడా హీరోగా కొన్ని సినిమాల్లో నటించనున్నాడు. జానీ మాస్టర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఆయన హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలను ప్రకటించారు. జానీ మాస్టర్ తొలి చిత్రం “జే1” ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జానీ మాస్టర్ హీరోగా నటించనున్న రెండవ చిత్రం ‘దక్షిణ’… ఓషో తులసీరామ్ దర్శకత్వంలో వహిస్తున్నారు. జానీ ప్రస్తుతం చెన్నైలో తలపతి విజయ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “బీస్ట్” మూవీ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు. నిన్న జానీ మాస్టర్ పుట్టినరోజు కావడంతో హీరో విజయ్ స్వయంగా జానీకి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. సెట్లో ఆయన బర్త్ డే సెలబ్రేషన్ నిర్వహించి జానీని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సినిమా అభిమానులు మాస్ పాటలు, మెలోడీలు… ఏ సాంగ్స్ అయినా జానీ కొరియోగ్రఫీ చేస్తే విజిల్స్ వేయాల్సిందే. ‘ఖైదీ నంబర్ 150’లో ‘సుందరి…’, ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేలు రాణి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘బుట్టబొమ్మ…’, ‘ఇస్మార్ట్ శంకర్’లో టైటిల్ సాంగ్, ‘రెడ్’లో ‘డించక్… డించక్’, ‘భీష్మ’లో ‘వాట్టే వాట్టే బ్యూటీ’, ధనుష్ చిత్రం ‘మారి-2’ లో ‘రౌడీ బేబీ’ పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల ‘రాధే’లో ‘సిటీమార్…’ పాటతో సల్మాన్ అభిమానులు, ఉత్తరాది ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు. దక్షిణాదిలో ప్రముఖ హీరోల చిత్రాలకు ఈయన కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This