Saturday, June 19, 2021

పెళ్లి తర్వాత మరింత రెచ్చిపోతున్న కాజల్

Must Read

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ హవా తగ్గుతుందని అంతా భావించారు.. కాని కాజల్ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.. అయితే బాలీవుడ్‌లో బ్లాక్ బస్తర్ గా నిలిచినా సింగం సినిమా కోసం అజయ్‌దేవ్‌గణ్‌తో మొదటిసారి జోడీకట్టింది దక్షిణాది హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం.

కార్తి కథానాయకుడిగా తమిళంలో విజయవంతమైన ‘ఖైదీ’ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తుండగా..ఆయన సరసన నాయికగా కాజల్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌ పాత్రకు స్థానం లేదు. అయితే బాలీవుడ్‌ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం కథలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం.

హీరో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ను జోడించినట్లు చెబుతున్నారు. ఆ సన్నివేశాల్లో అజయ్‌దేవ్‌గణ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్‌ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిసింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This