Saturday, June 19, 2021

నా కొడుకు పెద్దవాడయ్యాడు..! నిహారిక షాకింగ్ పోస్ట్..

Must Read

నాగబాబు కూతురు నిహారిక తను చేసే చిలిపి పనులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. పెళ్లి తర్వాత ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో తన లైఫ్ ఎంతో బోర్ గా ఉందని ఫీలవుతోంది. ఈ క్రమంలోనే అత్తారింట్లో ఉన్న నిహారిక వీలున్నప్పుడల్లా వంటింట్లో దూరి కొత్త కొత్త వంటలను ట్రై చేస్తుంది.

గత కొన్ని రోజుల క్రితం నిహారిక ఆపిల్ పై రెసిపీని చేసి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అదేవిధంగా ఎంతో అందంగా ముస్తాబవుతూ తయారైన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిహారిక పెళ్లి తర్వాత జరిగిన మొట్టమొదటి పుట్టిన రోజు కానుకగా తన భర్త ఇచ్చిన గిఫ్ట్ చూసి మరింత మురిసిపోతుంది.

నిహారిక పుట్టినరోజు కానుకగా ఒక స్పెషల్ పెట్ డాగ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు చైతన్య. ఆ డాగ్ ను నిహారిక తన పెద్ద కొడుకుగా భావించి దానికి బజ్ అని పేరు కూడా పెట్టారు. తనకు బోర్ కొట్టినప్పుడల్లా బజ్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటానని నిహారిక తెలిపారు. తాజాగా నిహారిక తన బేబీ బాయ్ ఎదుగుతున్నాడని, ఎంతో పెద్దగా అయిపోయాడని మురిసిపోతూ తన ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This