Tuesday, July 27, 2021

ఇండస్ట్రీలో విషాదం: యాక్సిడెంట్ లో హీరో విజయ్ మృతి

Must Read

సినీ పరిశ్రమపై కరోనా ఎంత ప్రభావం చూపించిందో అందరికి తెలిసిందో.. ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా పగ బట్టి ఇండస్ట్రీలో చాలా మందిని పొట్టన పెట్టుకుంది. తాజాగా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఓ నటుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.

కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంచారి విజయ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను హుటాహుటిన బెంగళూరులోని బన్నేర్ ఘట్టా రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. జూన్‌ 12 రాత్రి విజయ్‌ తన స్నేహితుడిని కలిసిన అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే విజయ్‌ తల, కుడి కాలికి బలమైన గాయాలు తలిగాయి. నిన్న ఆయన పరిస్థితి విషమంగా ఉండగా ఇప్పుడు ఆయన కన్ను మూసినట్టు తాజా సమాచారం. విజయ్ బ్రెయిన్ దాదాపు డెడ్ అయినట్టేనని, చికిత్సకు స్పందించడం లేదని డాక్టర్లు తెలియజేసారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలు దానం చేస్తున్నారని సమాచారం. ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులు తెలియజేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This