Tuesday, July 27, 2021

బ్రేకింగ్: ప్రముఖ నటుడికి యాక్సిడెంట్.. పరిస్థితి సీరియస్..

Must Read

ఇప్పటికే సినీపరిశ్రమలో కరోనా మహమ్మారి వలన ఎంతో మంది సీనియర్ నటులను కోల్పోయాం.. తాజాగా ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత అయిన సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. విజయ్ శనివారం రాత్రి తన స్నేహితుడు నవీన్‌తో బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు జెపి నగర్ వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినట్టు సమాచారం.

ఈ బైక్ ప్రమాదంలో విజయ్ మెదడు, కుడి తొడకు తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ICUలో ఆయనకు చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది. ప్రస్తుతం విజయ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విజయ్ 2015లో కన్నడ చిత్రం “నాను అవనాల్లా అవలుకు” చిత్రానికి గానూ జాతీయ అవార్డును తీసుకున్నారు.

సంజయ్ విజయ్, విజ్ఞన్, కృష్ణ తులసి, విలన్, వీట్ కలర్ మీడియం స్ట్రెంత్, కిల్లింగ్ వీరప్పన్, అల్లామా వంటి అనేక చిత్రాల్లో నటించాడు. సంచారి విజయ్ కన్నడలోనే కాదు చాలా తమిళ చిత్రాల్లో కూడా యాక్ట్ చేసారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This