Friday, July 30, 2021

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువ హీరో.. బ్రతికుండగానే అవయవదానం

Must Read

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులు మరణించగా.. తాజాగా ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ హీరో హఠాత్తుగా మరణించారు. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‍కు గురయ్యింది… జాతీయ అవార్డు గ్రహిత, ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్ కన్నుమూశారు. ఆయన మృతికి కన్నడ చిత్రసీమ ప్రముఖులతో పాటు కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప, రాజకీయాలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సంచారి విజయ్ అవయవాలు అన్నీ దానం చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

విజయ్ శనివారం (జూన్ 12) రాత్రి రేషన్ పంపిణి చేసేందుకు వెళ్లి.. తిరిగి తన స్నేహితులతో కలిసి బైక్ పై ఇంటికి వస్తుండగా.. వారి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడడంతో ఆయన స్నేహితులు వెంటనే చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయమవడంతో… విజయ్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు.

చికిత్సకు రెస్పాండ్ అవ్వడం లేదని తెలిసిన తరువాత అతను బ్రతకడం చాలా కష్టమని వివరించిన కొద్దీ సేపటి క్రితమే మరణించినట్లు కన్నడ మీడియా పేర్కొంది. అలాగే విజయ్ బ్రతకడని తెలిసిన అనంతరం అతని అవయవాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అతని బ్రదర్ సిద్దేష్ సంతకం చేసినట్లు తెలుస్తోంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This