Saturday, June 19, 2021

మహేశ్‌ బాబు ను ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్

Must Read

మహేశ్‌బాబు హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ప్రతినాయకుడి పాత్ర విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. మ్యూజికల్ ఛైర్స్ గేమ్ తరహాలో ఒక్కోసారి, ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి పేరు తెర ముందుకు వస్తోంది.

కరోనా‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్ విలన్‌గా నటించబోతున్నారని ఆ వార్త సారాంశం. అర్జున్ ట్రాక్ రికార్డ్, అతని యాక్టింగ్ ఎబిలిటీస్ ను దృష్టి లో పెట్టుకుని మహేశ్ బాబు సరసన ఇతనైతే బాగుంటుందని యూనిట్ సభ్యులు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇది కూడా గతంలో వచ్చిన పుకార్ల వంటిదేనా… లేకపోతే ఇందులో నిజం ఉందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సింది.

జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ సెట్లో మహేశ్‌ బాబు-అర్జున్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This