Tuesday, July 27, 2021

మెగా అభిమానులు ముందుగానే సందడి… విషయమేంటో?

Must Read

సోషల్ మీడియా పుణ్యాన సెలబ్రెటీలకు దగ్గర అవుతున్నారు అభిమానులు. దీంతో తమ అభిమాన స్టార్స్ ను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవ్వడం సులువైంది. వారి పుట్టినరోజు ఉంటే సరేసరి సందడి మాములుగా ఉండదు. వాళ్ళ మూవీస్ కి సంబంధించి విషయం ఉందంటే చాలు హంగామా చేస్తున్నారు. తాజాగా చిరంజీవి అభిమానులు కూడా సంబరాలు మొదలెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా 50 రోజులు ఉండగా… అప్పుడే హడావిడి మొదలైపోయింది. చిరంజీవి సిడీపీ రిలీజ్ అవ్వడంతో రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు మెగా ఫ్యాన్స్.

చిరంజీవి సామాజిక సేవలో కూడా ముందుంటూ ఎంతోమంది యూత్ కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన చిరు కరోనా కష్టకాలంలోనూ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించారు. లాక్ డౌన్ కాలంలో సినిమా కార్మికులకు సీసీసీ ద్వారా ఇంట్లోకి కావలసిన సరకులను అందించడమే కాకుండా ఫ్రీగా వ్యాక్సినేషన్ కూడా వేయించారు. ఆయన సేవను గుర్తించిన పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చిరుపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన చిరంజీవికి టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక మిస్టర్ బర్త్ డే రోజున ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటినుంచి చిరు బర్త్ డే బ్యాష్ ట్యాగ్ లతో, పిక్స్ తో వారు రచ్చరచ్చ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This