Thursday, June 24, 2021

మ్యూజిక్ డైరెక్టర్ చక్రి భార్య ఇప్పుడు ఎలా ఉన్నారు ?

Must Read

సంగీత దర్శకుడు చక్రి.. ఇతనికి దర్శకుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన సపోర్ట్ కారణంగానే.. పరిశ్రమలో మంచి మ్యూజికల్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఇదే విషయంను చక్రి చాలా సార్లు చెప్పాడు. అయితే ఇంత పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నా చక్రి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక పూర్తి స్టొరీ లోకి వెళ్తే..

సినిమా ఇండస్ట్రీలో కి రాకముందే చక్రి కి మ్యారేజ్ జరిగింది. కానీ ఆమెతో ఎకువ రోజులు కలిసి ఉండలేదు విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత శ్రావణితో పరిచయం కాస్తా ప్రేమగా మారడం పెళ్లికి దారి తీయడం తెలిసిందే. కానీ వీరిద్దరి పెళ్లి చక్రి తల్లికి, తమ్ముడికి ఏమాత్రం ఇష్టం లేదు.దీంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగేవట. కానీ చక్రి ఉన్నతకాలం అవి బయట పడలేదు. అయితే.. చక్రి హఠాన్మరణంతో ఆయన తల్లి, తమ్ముడు కలిసి ఆస్తి పాస్తులను, క్రెడిట్ కార్డులు, బ్యాంకు అకౌంట్ల పుస్తకాలు వంటివి దాచేశారట. ముఖ్యంగా చక్రి భార్య శ్రావణికి తెలియకుండా జాగ్రత్తవహించారట. పైగా తమ ఆస్తిని లాక్కుంది అని ఆమెపై రివర్స్ లో నిందలు వేసారట.

అయితే శ్రావణి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ఆమెకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న చక్రి ఇల్లు శ్రావణికి దక్కింది. అయితే ఇప్పుడు ఆమె చక్రి జ్ఞాపకాలతో జీవిస్తూ.. అతని పుట్టినరోజుకి, చనిపోయిన రోజుకి అనాధ శరణాలయాలకు వెళ్లి పండ్లు, బట్టలు పంచుతుంది. అలాగే తన రెగ్యులర్ మెయింట్ నెన్స్ కోసం శ్రావణి ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. తన అత్తింటి వారు చక్రీకి ఉన్న ప్లాట్లు, ఇతర ఆస్తులు తీసుకున్నా తనకు అంతగా బాధలేదుకానీ.. ఆయన చనిపోయిన కొన్ని రోజులకే ఇంకొక పెళ్లి చేసుకుందని దుష్ప్ర్రచారం చేయడం చాలా బాధ అనిపిస్తుందని ఆమె తన సన్నిహితులతో తన ఆవేదన చెప్పుకుంది.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This