Saturday, June 19, 2021

బ్రేకింగ్: స్టార్ డైరెక్ట‌ర్ క‌న్నుమూత‌!

Must Read

ప్రముఖ కవి, బెంగాలీ దర్శకుడు బుద్దదేబ్‌ దాస్‌ గుప్తా(77) అనారోగ్యంతో జూన్ 10వ తేదీ క‌న్నుమూశారు. లెజండ‌రీ ఫిల్మ్ మేక‌ర్ బుద్ధ‌దేవ్ కొంత‌కాలంగా కిడ్నీ సంబంధిత‌ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు.
అలానే ఆయ‌న‌కు కొంత‌కాలంగా డ‌యాల‌సిస్ జ‌రుగుతోంది. బుద్ధ‌దేవ్ దాస్ గుప్తా మృతి వార్త తెలియ‌గానే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు.

ఆయన కుటుంబానికి, సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఇంకా పలువురు పరిశ్రమ పెద్దలు, అభిమానులతోపాటు, నిర్మాత, రాజ్ చక్రవర్తి తదితరులు దాస్‌గుప్తా మరణంపై సంతాపం తెలిపారు. ద‌ర్శ‌కుడిగా స‌మాజంలోని అన్ని ‌కోణాలను బుద్ధ‌దేవ్ స్పృశించార‌ని ప్ర‌ధాని మోడీ వెల్లడించగా, ఆయ‌న లేని లోటు చిత్ర‌సీమ‌కు పూడ్చ‌లేనిద‌ని మ‌మ‌త అన్నారు.

1980, 90 ప్రాంతంలో అప్ప‌టి ఉత్త‌మ ద‌ర్శ‌కులు గౌత‌మ్ ఘోష్, అప‌ర్ణ సేన్ లో క‌లిసి స‌మాంత‌ర సినిమాల రూప‌క‌ల్ప‌న‌కు బుద్ధ‌దేవ్ దాస్ గుప్తా విశేషంగా కృషి చేశారు. అలానేఉత్త‌ర(2000),స్వ‌ప్న‌ర్ దిన్(2005) చిత్రాల‌కు గానూ ఆయ‌న ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This