Thursday, June 24, 2021

ఆది పురుష్ కి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా..

Must Read

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్‌ లవ్‌స్టోరి”రాధేశ్యామ్” మూవీ ఇప్పటికే భారీ అంచనాలు నడుమ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే పౌరాణిక నేపథ్యంలో డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న “ఆది పురుష్” మూవీని టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదిపురుష్‌ సినిమా కోసం T-SERIES ఫిల్మ్స్‌ సంస్థ ప్రభాస్‌కు యాభై కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పౌరాణిక నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్‌ సీతగా నటిస్తోంది.

అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే సంవత్సరం అగష్టు 11న తెలుగు, హిందీ, తమిళం, భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This