Tuesday, July 27, 2021

గోవాలో పుష్ప షూటింగ్

Must Read

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా రాబోతుంది. దాదాపు రెండు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి సుకుమార్ ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్ గా క‌నిపించ‌నుండ‌గా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో క‌థ సాగుతుంది.

అయితే, ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాల‌ని భావిస్తూ… షూటింగ్ ను సెకండ్ పార్ట్ కోసం 100రోజులు పొడిగించాల‌ని నిర్ణ‌యించారు. అయితే ఫ‌స్ట్ పార్ట్ పూర్తి చేసేందుకు మ‌రో నెల రోజులు కావాలి. దీంతో సెకండ్ పార్ట్ 100రోజుల‌కు గ్యాప్ తీసుకోవాల‌ని, ముందుగా పార్ట్ 1 పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. జులై ఫ‌స్ట్ వీక్ నుండి షూట్ గోవాలో ప్రారంభంకానుంది.

అయితే బ‌న్నీ ‌నిర్ణయం మేర‌కు సింగిల్ షెడ్యూల్ లో పార్ట్-1 పూర్తి చేయ‌నున్నారు. ఈ సినిమాలో బ‌న్సీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తుండ‌గా, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇస్తున్నారు

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This