Saturday, June 19, 2021

పుష్ప విలన్ షాకింగ్ డెసిషన్..! షాక్ లో బన్నీ

Must Read

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుందని ప్రకటించారు. కాగా రూ.250 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం . మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది.

ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా సందడి చేయనున్నాడు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవాలనే షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి, సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా రాయలసీమలోని చిత్తూరు యాస నేర్చుకుంటున్నట్టు సమాచారం.

లాక్ డౌన్ టైం లో ముఖ్యంగా తెలుగు నేర్చుకోవడం కోసమే వినియోగిస్తున్నాడట. ఈ వార్తలు గనుక నిజమైతే ఫహద్ “పుష్ప”లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఉంది. దీనితో అతని డెడికేషన్ చూసి అల్లు అర్జున్ కూడా షాకయ్యాడట.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This