Tuesday, July 27, 2021

జబర్దస్త్ సుధీర్‏కు ముద్దుపేరు పెట్టుకున్న రష్మి

Must Read

జబర్దస్త్ లో రష్మి గౌతమ్.. సుడిగాలి సుధీర్ ఈ జంట గురించి ప్రేక్షకులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. బుల్లితెరపై వీరిద్దరు చేసే సందడి మాములుగా ఉండదు.నిజ జీవితంలో తాము మంచి స్నేహితులమని చాలా సార్లు సుధీర్, రష్మి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వీరి రీల్ లవ్‏కు మాత్రం తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తాజాగా రష్మి సుధీర్‏ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

టెలివిజన్ లో వచ్చే షోలలో సుధీర్, రష్మి ఉంటే.. టీఆర్పీ రెటింగ్ దూసుకుపోతుంది. అటు సోషల్ మీడియాలో కూడా సుధీర్- రష్మి రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. వీరిద్ధరికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా గతంలో రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ.. కేవలం రీల్ లో మాత్రమే అలా ఉంటామని చెప్పారు.

సుధీర్‏కు ముద్దు పేరు పెట్టుకుంది రష్మి. ఇకపై అలాగే పిలుస్తా అని చెప్పింది. సుధీర్‏ను ఇకనుంచి సుట్టి అని పిలుస్తానంటూ అందరికి షాకిచ్చింది. ఓ ప్రముఖ ఛానెళ్లో ప్రసారమయ్యే రియాల్టీ షోలో టీంలీడర్లుగా వ్యవహరిస్తున్నారు వీరిద్దరు. ఇందులో సుధీర్ గురించి చెబుతూ.. క్యూట్ ఎక్స్‏ప్రెషన్స్ తో అక్కడున్న వారిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆట మూవీలోని ఏం చాందిని రా పాటకు డ్యాన్స్ చేశారు సుధీర్ రష్మి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This