Saturday, June 19, 2021

బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పిన యువరాజ్ సింగ్

Must Read

న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నేటితో (గురువారం) 61 ఏళ్లు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. తెలుగు చిత్ర సీమ‌లో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాల‌కృష్ణ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ఆయ‌న అభిమానుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. సినిమా నుంచి రాజ‌కీయ నాయ‌కులు వ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు.

అయితే బాలయ్య కి ప్రముఖ ఆల్ రౌండర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంలో బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రిలో బాల‌కృష్ణతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ..

హ్యాపీ బర్త్ డే నందమూరి బాలకృష్ణ సర్, మీ నటన తో, మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవ నిస్వార్థం గా కొనసాగాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాక ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.

ఇవే మీకు నా బెస్ట్ విషెస్ అంటూ చెప్పుకొచ్చారు. టీమిండియా ప్లేయ‌ర్ బాల‌కృష్ణ‌కు విషెస్ చెప్ప‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే క్యాన్స‌ర్ బారిన ప‌డిన యువ‌రాజ్ సింగ్‌.. మొక్క‌వోని దీక్ష‌తో క్యాన్స‌ర్‌ను జ‌యించిన విష‌యం తెలిసిందే.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This