Saturday, June 19, 2021

ప్రకాశ్ రాజ్ ఇంట్లో ఘోర విషాదం.. కుప్పకూలిన కుటుంబసభ్యులు

Must Read

సినీపరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. నటుడు, నిర్మాత, ఫిల్మ్ క్రిటిక్, యూట్యూబర్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కు అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడైన వెంకట్ సుభ మరణించడం సిని పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. ఆయన మరణవార్త విన్న నటుడు ప్రకాష్ రాజ్ అక్కడికక్కడే కుప్పకూలారు.. ఫ్యామిలీ మొత్తం ఎంతో చింతించారు.. ఆయన మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన సినీ ప్రముఖులు తమ సంతాప సందేశాలను సోషల్ మీడియాలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

వెంకట్ సుభ విషయానికి వస్తే.. పలు తమిళ సినిమాల్లో నటించారు. అంతే కాకుండా పలు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా నిర్మించారు. క్రికెటర్ హర్బజన్ సింగ్‌ను దక్షిణాది సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తూ.. ఫ్రెండ్‌షిప్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. వెంకట్ సుభకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. అయితే ఆయన కోలుకొంటున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకొన్నారు. కానీ ఆయన ఊహించని విధంగా మరణించడం ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.

తనకు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు, మేనేజర్‌గా వ్యవహరించిన వెంకట్ సుభ మరణంపై ప్రకాశ్ రాజ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇది నిజం కాకూడదని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. చాలా బాధగా ఉంది. నా స్నేహితుల్లో, కుటుంబంలో ఒక్కొక్కరిని కోల్పుతుంటే ఏమీ చేయలేనా అనే పరిస్థితి వెంటాడుతున్నది. వారి ‌తీపిగుర్తులతో గుండె బాధతో బరువు ఎక్కుతుంది. నా స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రకాశ్ రాజ్ తన ఆవేదనను తెలియజేసారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This