Saturday, June 19, 2021

ఇండస్ట్రీ లో మరో విషాదం: ప్రముఖ నటి మృతి

Must Read

గ‌త ఏడాది నుండి సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారి మ‌ర‌ణాల‌కు సంబంధించి అనేక వార్త‌లు వింటున్నాం. కొంద‌రు క‌రోనాతో క‌న్నుమూస్తుంటే మ‌రి కొంద‌రు అనారోగ్యంతో తుది శ్వాస విడుస్తున్నారు. తాజాగా ప్రముఖ కన్నడ సినీ నటి బీ జయ (75) కన్నుమూశారు. వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న(జూన్ 3, గురువారం) తుదిశ్వాస విడిచారు. నటి జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్‌లో హాస్య, క్యారక్టెర్‌ పాత్రల్లో న‌టించి మెప్పించిన జ‌య ఇక లేరనే వార్త క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

1944లో జన్మించిన ఆమె థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరియ‌ర్ ప్రారంభించిన జ‌య 1958 లో భ‌క్త ప్ర‌హ్లాద చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేశారు. క్యారెక్టర్‌ నటిగా 350కిపైగా సినిమాలలో జయ నటించారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్‌లో అనేర హాస్య, క్యారక్టెర్‌ పాత్రల్లో అభిమానుల్లోజయమ్మగా ప్రత్యేక పాత్రను దక్కించుకున్నారు.

డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, ద్వారకేష్, బాలకృష్ణ వంటి తొలి తరం నటులతో ఆమె నటించారు. తరువాతి సంవత్సరాల్లో, ఆమె టెలివిజన్ సీరియళ్లలో కూడా కనిపించారు. 2004-05లో గౌడ్రూ మూవీలో నటనకు గాను జయమ్మ ఉత్తమ సహాయక నటి అవార్డు గెల్చుకున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This