Saturday, June 19, 2021

టాలీవుడ్ లో మరో ఘోరం.. మెగా ఫ్యామిలీ వ్యక్తి మృతి..!

Must Read

ప్రస్తుతం దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుపోయింది.. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఎవ్వరిని వదలడం లేదు.. మొదటి వేవ్ లో కేసులు తక్కువగానే ఉండేవి మరణాలు కూడా చాలా తక్కువగానే ఉండేవి. కానీ ఈ సెకండ్ వేవ్ మాత్రం కేసులతో పాటు మరణాలు కూడా భయాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే సినీపరిశ్రమకి సంబంధించి కొంతమంది కరోనా కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మరో వ్యక్తి కరోనా కారణంగా మరణించారు.

కరోనా ధాటికి టాలీవుడ్ లో చాలా మంది యువ డైరెక్టర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా కొన్ని సినిమాలకు దర్శకత్వం విభాగంలో పనిచేసిన అంబటి రాజా మృతి చెందినట్టు సమాచారం.. ఆయన చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు చెబుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం కరోనా సోకగా ఆయన చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయన నిన్న పొద్దుపోయాక కన్నుమూసినట్లు సమాచారం.

అంబటి రాజా మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా నాగబాబుతో ఆయన ఎక్కువ సన్నిహితంగా ఉండేవారని కుటుంబసభ్యులు తెలియజేసారు. ఆయన చనిపోవడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

డైరెక్టర్ రాజా మరణానికి సంబంధించి మొదటగా వినాయకుడు సినిమా ఫేమ్ కృష్ణుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ”నాగబాబుకు చాలా దగ్గరి వ్యక్తి, మంచి సన్నిహితుడు నా శ్రేయోభిలాషి రాజా మరణం కలచివేస్తోంది” ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని అన్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This