Saturday, June 19, 2021

షాక్: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సాహూ హీరోయిన్..

Must Read

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది న‌టీమ‌ణులు డాక్ట‌ర్స్‌ని పెళ్లాడుతున్నారు. ప్రభాస్ “సాహో” చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ తాజాగా తన ప్రియుడిని పెళ్లాడింది. తన చిరకాల ప్రియుడు ఆస్ట్రేలియాకి చెందిన డాక్ట‌ర్ తుషాన్ భిండిని పెళ్లి చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. వీరి వివాహం ఆత్మీయుల మధ్య ఆస్ట్రేలియాలో జరిగినట్టు తెలుస్తోంది.

ఎవెలిన్ శర్మ, డాక్టర్ తుషాన్ భిండి 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి ముందు ఒక సంవత్సరం పైగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. తుషాన్ ఆస్ట్రేలియాలో డెంటల్ సర్జన్ గా పని చేస్తున్నారు. నిశ్చితార్థం జరిగినప్పటి నుండి ఎవెలిన్ ఆస్ట్రేలియాలోనే ఉంటోంది. ఇక ఈ బ్యూటీ తన పెళ్లి గురించి మాట్లాడుతూ “బెస్ట్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవడం కంటే మంచి అనుభూతి లేదు. మా జీవితాన్ని కలిసి గడపడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము అంటూ తన పెళ్లిపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఎవెలిన్ శర్మ-తుషాన్ భిండి పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This