Home Movies నాగ చైతన్యతో గొడవలు.. షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన సమాంత

నాగ చైతన్యతో గొడవలు.. షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన సమాంత

0

ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న హీరోయిన్ సమంత అక్కినేని. ఓ పెద్దంటి కోడలు అయినా తర్వాత కూడా ఈమె గ్లామర్ షో చేస్తుంది.. సినిమాలు చేస్తుంది.. ముందున్నట్లే ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు అభిమానులతో చాటింగ్ చేస్తూ తన ముచ్చట్లు కూడా షేర్ చేసుకుంటుంది సమంత. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

ప్రతి వ్యక్తికి తన ఇష్టాలేంటో తెలుసుకోవడం చాలా అవసరమని చెప్పిన సమంత..ముందు తమను తాము ప్రేమించుకున్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపగలమని చెబుతుంది. ఇక తన విషయానికి వస్తే నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమని, ఈ మూడు లక్షణాలు తనకు బాగా నచ్చుతాయి అని సమంత పేర్కొంది.

ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని సీక్రేట్స్ బయటపెట్టింది.అయితే ప్రతిసారి మొదట కాంప్రమైజ్‌ అయ్యేది మాత్రం తానే అని బయటపెట్టేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమా చేస్తోండగా, నాగ చైనత్య థ్యాంక్యూ, లాల్‌ సింగ్‌ చద్దా చిత్రాల్లో నటిస్తున్నారు.

Exit mobile version