Saturday, June 19, 2021

బ్రేకింగ్: సీనియర్ నటుడు ఆరోగ్యం విషమం.. హాస్పిటల్లో చికిత్స!

Must Read

కరోనా మహమ్మారితో ఎంతో మంది నటులు మృతి చెందారు. మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా నటుడు దిలీప్‌కుమార్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా ఆయన శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దిలీప్ కుమార్ ఆరోగ్య ప‌రిస్థితిని వారు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని హాస్పిటల్లో డాక్టర్లు తెలియజేసారు.
అయితే నటుడు దిలీప్ కుమార్ ఏ అనారోగ్య స‌మ‌స్య‌ కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరార‌న్న విష‌యంపై స్ప‌ష్టత రాలేదు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి, అందిస్తోన్న చికిత్స‌పై వైద్యులు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

గ‌త ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించ‌క ముందు కూడా దిలీప్ కుమార్ అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. తాను , త‌న భార్య సైరా భాను ఐసోలేష‌న్‌లో ఉంటున్నామ‌ని ఫ్యాన్స్ కి తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This