Friday, July 30, 2021

టాలీవుడ్ నటి కవిత కొడుకు మృతి. భర్త పరిస్థితి విషమం..

Must Read

కరోనా మహమ్మారి దేశంలో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. సినీ పరిశ్రమ కూడా ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఆమె ఇంట్లో కరోనా తీవ్ర విషాదం సృష్టించింది. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు.

ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. హాస్పిటల్ లోనే అతను తుది శ్వాస విడిచినట్టు సమాచారం.

ఇక కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పలు తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన కవిత ప్రస్తుతం “ఎండ్రాండ్రం పున్నగై “అనే టీవీ షోలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. 11 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది. ఆ తరువాత దాదాపు 350 చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This