Saturday, June 19, 2021

బ్రేకింగ్: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఘంటసాల కొడుకు మృతి

Must Read

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రముఖ నటులను కోల్పోయింది సినీపరిశ్రమ. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు ఘంటసాల రెండో కొడుకు రత్న కుమార్ మృతి చెందారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న కొన్ని అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరీ హాస్పిట‌ల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రిత‌మే ఆయ‌న‌కు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. అయితే చాలా కాలంగా ఘంట‌సాల ర‌త్న‌కుమార్ కిడ్నీ స‌మ‌స్య‌తో డ‌యాల‌సిస్ పై ఉన్నార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

సింగర్ ఘంట‌సాల అమ‌ర గాయ‌కుడిగా పేరు గ‌డిస్తే, ఆయ‌న కుమారుడైన ర‌త్న‌కుమార్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్ళ‌లో త‌న తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ గాయ‌కుడు కావాల‌ని ప్రయత్నించినా, కానీ బ్రేక్ రాలేద‌ని ర‌త్న‌సాగ‌ర్ చెప్పేవారు. అదే స‌మ‌యంలో త‌మిళ చిత్రం కంచి కామ‌క్షికి తెలుగులో డ‌బ్బింగ్ చెప్పాన‌ని, ఆ సినిమా దాదాపు వంద‌రోజులు ప్ర‌ద‌ర్శితం కావ‌డంతో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని ర‌త్నకుమార్ తెలిపారు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల కెరీర్ లో వేయికి పైగా త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ, సంస్కృత చిత్రాల‌కు ర‌త్న‌కుమార్ డ‌బ్బింగ్ చెప్పారు. ప‌ది వేల‌కు పైగా త‌మిళ‌, తెలుగు టీవీ సీరియ‌ల్ ఎపిసోడ్స్ కు గాత్రాన్ని ఇచ్చారు.

గ‌తంలో ఎనిమిది గంట‌ల పాటు నిర‌వ‌ధికంగా డ‌బ్బింగ్ చెప్పి ఆయ‌న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. అమేజింగ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్, తమిళ‌నాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ ఆయ‌న పేరు న‌మోదైంది. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుండి కూడా బెస్ట్ మేల్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును ఘంట‌సాల ర‌త్న‌కుమార్ గెలుచుకున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This