Saturday, June 19, 2021

బ్రేకింగ్: నటి సురేఖ హఠాన్మరణం.. షాక్ లో సినీపరిశ్రమ

Must Read

దేశంలో కరోనా మహమ్మారి ఎందరో మంది నటులను బలి తీసుకుంది. తాజాగా ప్రముఖ నటి సురేఖ మృతిచెందారు. ఆదివారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తుండగా.. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించినప్పటికీ.. అప్పటికే పరిస్థితి విషమించింది.. కాసేపటికే ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలియగానే కన్నడ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

ప్రస్తుతం సురేఖ వయసు 66 సంవత్సరాలు. ఆమె మృతిచెందడం పట్ల శాండల్ వుడ్ కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు ఆమె ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. సురేఖ అంతిమ సంస్కారాలను ఆదివారమే నిర్వహించారు. బెంగళూరులోని బనశంకరి శ్మశాన వాటికలో ఖననం చేశారు.

కాగా.. తన సినీ కెరీర్లో 160కిపైగా చిత్రాల్లో నటించిన సురేఖ.. ఎంతో మంది స్టార్ల సరసన ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తో కలిసి త్రిమూర్తి ఒలావు గెలువు గిరి కాన్యే సాక్షత్క వంటి చిత్రాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా.. భరతనాట్య కళాకారిణిగా అలరించారు సురేఖ. సినిమాల్లో టాప్ స్టార్ గా నిలిచిన సురేఖ.. అన్నీ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించారు. ఉన్నట్టుండి అభిమానులను విడిచి వెళ్ళడం అందరికి శోకసంద్రంలో ముంచింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This