Tuesday, July 27, 2021

నిన్ను వదిలే ప్రశ్నే లేదు.. బయట ఎలా తిరుగుతావో చూస్తాం.. హైపర్ ఆదికి వార్నింగ్..!

Must Read

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మరో వివాదంలో చిక్కుకున్నాడు. జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది పై ఎల్పీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. కామెడీతో పాటు కాంట్రవర్సీలు కూడా ఈయనకు ముందు నుంచి అలవాటు. తాజాగా ఈయనపై తెలంగాణ జాగృతి సభ్యులు మండి పడుతున్నారు. బయట కనిపిస్తే కచ్చితంగా కొడతామంటూ వార్నింగులు కూడా ఇస్తున్నారు. వ్యవస్థను విమర్శిస్తే తిప్పలు తప్పువు. ఇప్పుడు ఇదే జరిగింది. హైపర్ ఆదికి దిమ్మతిరిగే షాక్ తగిలింది.

తెలంగాణ యాస, భాషను అవమానించారంటూ ఈయనపై జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం ముదురుతుంది. ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా హైపర్‌ ఆది ఆ వ్యాఖ్యలకు క్షమాపణ తెలిపారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పినా కూడా తాము వదిలేది లేదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆది క్షమాపణలు చెప్పిన అనంతరం ఆ సంస్థ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ స్పందించారు.

హైపర్‌ ఆదిని బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు అని తెలిపారు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా మేము తగ్గేది లేదని.. కచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This