Friday, July 30, 2021

బ్రేకింగ్: సీరియల్ నటితో సుడిగాలి సుధీర్ పెళ్లి?

Must Read

సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఈయనకు సూపర్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం బుల్లితెరపై ఈయన కంటే తోపులు అయితే ఎవరూ లేరు. 30 రోజులు బిజీగానే ఉంటాడు సుధీర్. జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరికొన్ని షోలు కూడా చేసుకుంటూ బిజీ అయిపోయాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ట్రేండింగ్ లో ఉంటాడు సుధీర్.. తాజాగా, పర్సనల్ లైఫ్ విషయంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

ఈ నేపథ్యం లోనే హైపర్ ఆది, ఇమ్మానుయేల్, ఆటో రామ్ ప్రసాద్ అంతా కలిసి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లి చేసేశారు. జబర్దస్త్ యాంకర్ రష్మీతో సుధీర్ ఎప్పటినుండో లవ్ ఎఫైర్ నడిస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా వార్తలు వచ్చాయి. దీనిపై అలాంటిది ఏం లేదని సుధీర్, రష్మీ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇంతలో మధ్యలో సీరియల్ నటి నవ్యస్వామి సుధీర్ తో క్లోజ్ గా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

నవ్య అంటే తనకు చాలా ఇష్టమంటూ ఇమ్మానుయేల్‌ని పిలిచి చెప్పారు సుధీర్. దీంతో అందరి సమక్షంలో నవ్యతో పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేసి సుధీర్ కి పెళ్లి చేసేశాడు హైపర్ ఆది. తీరా పెళ్లయ్యాక ఫస్ట్ నైట్ ఉండదంటూ సడెన్ షాకిచ్చాడు ఆటో రామ్ ప్రసాద్. దీంతో బిత్తరమొహం వేశాడు సుధీర్.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This