Tuesday, July 27, 2021

సుడిగాలి సుధీర్ పెళ్లిపై తండ్రి కామెంట్స్

Must Read

సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఈయనకు సూపర్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం బుల్లితెరపై ఈయన కంటే తోపులు అయితే ఎవరూ లేరు. 30 రోజులు బిజీగానే ఉంటాడు సుధీర్. జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరికొన్ని షోలు కూడా చేసుకుంటూ బిజీ అయిపోయాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ట్రేండింగ్ లో ఉంటాడు సుధీర్.. తాజాగా, పర్సనల్ లైఫ్ విషయంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సుధీర్ పెళ్లి గురించి ప్రస్థావన వచ్చింది. దీనిపై అతడి తండ్రి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే…

అయితే వచ్చే వారం ప్రసారం కానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో ఫాదర్స్ డే స్పెషల్‌గా కమెడియన్ల తండ్రులను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ తండ్రితో వీడియో కాల్ మాట్లాడాడు. అప్పుడు అతడు మాట్లాడుతుండగా.. హైపర్ ఆది వచ్చి ‘అంకుల్.. మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు. మనోడి తర్వాత నేను రెడీగా ఉన్నా’ అని అనగా ఆయన షాకింగ్‌ కామెంట్స్ చేసారు.

హైపర్ ఆది అలా అడగగానే సుధీర్ తండ్రి మాట్లాడుతూ.. ‘ముందు నువ్వు చేసుకో. నువ్వు చేసుకుంటేనే చేసుకుంటా అంటున్నాడు’ అంటూ పంచ్ పేల్చారు. వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘నేను చేసేసుకుందామని ఒక అమ్మాయిని చూసేసుకున్నాను. ఆ అమ్మాయిని మనోడు చూసేసుకున్నాడు’ అంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు.. దీంతో ఈ ప్రోమో నెట్లో నవ్వులు పూయిస్తుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This