Tuesday, July 27, 2021

బ్రేకింగ్: కరోనాతో మరో స్టార్ హీరో మృతి

Must Read

కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుడిని కాటేసింది.. పలు చిత్రాల్లో హీరోగా మరియు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన షమన్ మిత్రు గురువారం ఉదయం కరోనాతో చెన్నయ్ లో కన్నుమూశారు.

పూర్తి వివరాలకు వీడియో చూడండి:

కొన్ని రోజుల క్రితం కోవిడ్ పరీక్ష చేయగా ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో హాస్పటల్ లో చేర్చారు. అయితే ఆయన కరోనా నుండి బయటపడలేకపోయారు.

భార్య, ఐదేళ్ళ కుమార్తె ఉన్న షమన్ మిత్రు మంచి నటుడు కూడా. 2019లో వచ్చిన ‘తొరత్తి’ చిత్రంలో షమన్ మిత్రు హీరోగా నటించడమే కాకుండా దానిని నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షమన్ మిత్రు గొర్రెల కాపరిగా కనిపించడం కోసం గెడ్డం పెంచి, బరువు తగ్గారు. కొన్ని మైళ్ల దూరం గొర్రెల వెంట చెప్పుల్లేకుండా నడిచాడు.. ఎండ వేడిమిని తట్టుకున్నాడు..

ఇవన్నీ చేయడానికి చాలామంది నటులు ఇప్టపడరు. కానీ నేను ఆ పాత్ర చేయడానికి ఎంతో ఇష్టంగా ఆ పాత్రకు తగ్గట్టుగా.. వర్కవుట్స్‌ చేసి నటించాను అని అన్నారు. మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యకళ నాయికగా నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This