Saturday, June 19, 2021

బ్రేకింగ్: హీరో అజిత్ ఇంట్లో బాంబు కలకలం.. షాక్ లో ఫ్యాన్స్

Must Read

ఈ మద్య సెలబ్రెటీలను లక్ష్యంగా చేసుకొని కిడ్నాప్, బాంబు బెదిరింపు కాల్స్ చేయడం చూస్తున్నాం. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులను ఓ వార్త ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది. అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ ‌రావడం క‌ల‌క‌లం రేపింది. చెన్నై తిరువాన్మియూరులో ఉన్న ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. దీంతో, ఈ కాల్ కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు అందించారు.

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. జాగిలాలతో పాటు అజిత్ ఇంటికి వెళ్లిన బాంబ్ స్వాడ్ ఇంటి మొత్తాన్ని తనిఖీ చేశారు. బాంబు కనిపించకపోవడంతో… అది ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, ఆ కాల్ నంబర్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇదిలా ఉంటే అజిత్‌కు ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ రావ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో 2020లోనూ ఓసారి అజిత్‌కు ఇలాంటి కొంద‌రు అఖ‌తాయిలు ఇలాగే ఫోన్ చేశారు. పోలీసులు అలర్ట్ అయి అది ఫేక్ కాల్ అని తేల్చారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This