Saturday, June 19, 2021

విమాన ప్రమాదంలో స్టార్ హీరో మృతి!

Must Read

ప్రముఖ న‌టుడు జో లారా, ఆయ‌న భార్య‌, మొత్తం 7 మంది కుటుంబ‌స‌భ్యులు అనుకోని రీతిలో విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. 1980, 1990 ద‌శ‌కంలో అమెరికా టీవీ సిరీస్‌లో ప్ర‌సారం అయ్యిన టార్జ‌న్ ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సిరీస్‌ల్లో జో లారా టార్జ‌న్ పాత్రలో నటించి మెప్పించాడు. టెనస్సీ విమానాశ్రయం ఫ్లోరిడాకు బయలు దేరిన సెస్సెనా సి 501 విమానం కొంత సేపటికీ దక్షిణ నౌష్వెల్లీకి 19 కిలోమీటర్ల దూరంలోని పెర్సీ ఫీస్ట్‌ సరుస్సులో కుప్పకూలిపోయిందని రెస్క్యూ సిబ్బంది సమాచారం అందచేసారు.

ఈ ప్రమాదంలో అతనితో పాటు జో లారా భార్య, అమెరికన్ రచయిత మరియు డైటీషియన్ గ్వెన్ షాంబ్లిన్ సహా మరో 5గురు అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలో ఒక సరస్సులో ప్రైవేట్ జెట్ కూలిపోవడంతో మరణించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ చేసి 5 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలిపారు.

అయితే ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని ధృవీకరించిన తరువాత జో లారా ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. లారా నటించిన టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్’ మొత్తం 22 ఎపిసోడ్‌లుగా 1996-2000 మధ్య వచ్చింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This